RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలిసిందే. ఈ మూవీ ఆర్సీ 15గా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు. ఆర్సీ 16 హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
కాగా ఇప్పుడు రాంచరణ్-బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. షూట్ కోసం భారీ విలేజ్ సెట్ వేస్తున్నారని ఫిలింగనర్ సర్కిల్ సమాచారం. సినిమాలో 60 శాతం షూటింగ్ ఈ సెట్లోనే జరుగనుందట. ఈ సెట్టు కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రాంచరణ్‌కు జోడీగా తొలిసారి నటిస్తోంది. దేవర తర్వాత జాన్వీకపూర్ సంతకం చేసిన రెండో తెలుగు సినిమా ఇది.
ఆర్సీ 16 చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నాడు. ఏఆర్ రెహమన్ ఇప్పటికే మూడు అద్భుతమైన పాటలను సిద్దం చేశాడని వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడని ఇన్సైడ్ టాక్. సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఆర్సీ 16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. రాంచరణ్ వీటితోపాటు సుకుమార్ (Sukumar) హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో RC17 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023