హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు.. వీళ్లు కాలు కదిపితే చాలు థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. అలాంటిది ఏకంగా వీరిద్దరూ కలిసి నువ్వానేనా అనే రేంజ్లో డ్యాన్స్‌లో పోటీపడితే ఇక ఆ పోరు ఆద్యంతం రక్తికట్టాల్సిందే. అందుకు ‘వార్-2’ సినిమా వేదిక కాబోతున్నది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్-2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పాటను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసున్నది. ఇందులో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తారట. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో ఈ పాటను చూస్తే అర్థమవుతుందని బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఈ నెలలోనే ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘వార్-2’ ప్రేక్షకుల ముందుకురానుంది.