Hrithik Roshan | ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఆ మాత్రం రాజీపడక తప్పదు : హృతిక్ రోషన్
బాలీవుడ్ హాట్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) సరైన షేప్‌లో ఉండేందుకు త్యాగాలు తప్పవని చెబుతున్నాడు. షూటింగ్లో, ప్రయాణాల్లో తన ఆహార అలవాట్లను ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో హృతిక్ రోషన్ తన అభిమానులతో పంచుకున్నాడు.
ముంబై : నిత్యం ఫిట్‌గా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఇష్టాలను వదులుకోవాలి. ఇష్టమైన ఫుడ్స్‌ను పక్కనపెట్టి పోషకాహార ఆప్షన్స్‌కు మారాలి. చురుకుగా ఉండేందుకు ఆహారంతో పాటు వ్యాయామం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. సినీ సెలబ్రిటీలైతే పర్ఫెక్ట్ ఫిగర్ కోసం ఎన్నింటినో వదులుకుంటారు. బాలీవుడ్ హాట్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) సరైన షేప్‌లో ఉండేందుకు త్యాగాలు తప్పవని చెబుతున్నాడు.
షూటింగ్లో, ప్రయాణాల్లో తన ఆహార అలవాట్లను ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో హృతిక్ రోషన్ తన అభిమానులతో పంచుకున్నాడు. ఇన్‌స్టా ఫొటోల్లో హృతిక్ బ్లాక్ కంటైనర్‌లో గ్రీన్ క్యాప్సికమ్, టమాట ముక్కలు, చిన్న టిక్కీ తరహా ఫుడ్ ఐటెమ్స్ కనిపించాయి. ఈ టిక్కాలు ప్రొటీన్లతో నిండిఉన్నాయని క్యాప్షన్‌లో హృతిక్ హింట్ ఇచ్చాడు.
తన లగేజ్‌లో ఆరు బాక్సులు ఉంటాయని, ప్రతి మూడు గంటలకు ఒకసారి తాను తీసుకునే భోజనంలో 130 గ్రాముల (కుక్డ్ వెయిట్) ప్రొటీన్‌తో పాటు కూరగాయలు ఉంటాయి. ఈ ఆహారం ఇంట్లో తయారుచేసిందని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇంట్లో తయారుచేసి చల్లగా ఉన్న ఆహార పదార్ధాలనే తాను తీసుకుంటానని, షూటింగ్స్‌లో ప్రయాణాల సమయంలో ఇలాంటి త్యాగాలు తప్పవని బాలీవుడ్ స్టార్ రాసుకొచ్చాడు. మీ ఆరోగ్య లక్ష్యాలను అందుకునేందుకు మీరు చేసిన త్యాగాలేంటని ఈ పోస్ట్‌లో హృతిక్ తన ఫాలోయర్లను ప్రశ్నించాడు.
Read More :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

