Skanda Trailer | ‘మాకు ఎదురొస్తే దేన్నైనా పచ్చడ పెడ్తాం జాడీ ఎక్కిస్తాం’.. కేక పెట్టిస్తున్న స్కంద రిలీజ్ ట్రైలర్
Skanda Trailer | రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద (Skanda). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ కా బాప్ రేంజ్లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా అనుకుంటున్నారు.
Skanda Trailer | రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద (Skanda). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ కా బాప్ రేంజ్లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ కొత్త ట్రైలర్ బోయ మాస్ డైలాగ్‌లతో కేక పెట్టిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లోని మేము కోడిని, పొట్టేలునే కాదు మాకు ఎదురొస్తే దేన్నైనా పచ్చడ పెడ్తాం.. జాడీ ఎక్కిస్తాం అంటూ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో పేలుతుంది. ఇక నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో సూడను.. రింగ్‌లో దిగితే రీసౌండ్ రావాలె.. సూసుకుందాం.. బరాబర్ సూసుకుందాం.. అంటూ రామ్ పోతినేని చెప్పిన పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Chuskundaam…Baraabar Chuskundaam! #SKANDA RELEASE TRAILER https://t.co/sHed5UgBhb pic.twitter.com/js5fH021R4
— RAm POthineni (@ramsayz) September 25, 2023
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
Ayesha Khan | ఎర్ర చీరలో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్.. అందమైన ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

