సాయి ధరమ్ తేజ్ బయటికి ఎప్పుడు రానున్నాడు.. డిశ్చార్జి తర్వాత పరిస్థితేంటి..?

Sai Dharam tej | మెగా మేనల్లుడు సాయిసాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. బయటికి ఎప్పుడు వస్తున్నాడు.. కొన్ని రోజులుగా మెగా అభిమానులు తరుచుగా అడుగుతున్న ప్రశ్న ఇది. తేజూ బైక్ యాక్సిడెంట్‌కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఆ టైంలో చాలామంది తేజూ ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిచోట్ల మాత్రం మనసు ఒప్పుకోలేని మాటలు వినిపించాయి. ఇంకా ఆయన కోమాలోనే ఉన్నాడని.. స్పృహలో లేడని.. హాస్పిటల్లో చికిత్సకు కూడా స్పందించడం లేదని సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై పుకార్లు బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు వాటితో పనిలేదు. ఎందుకంటే ఇటీవల అక్టోబర్ 15న ఆయన పుట్టిన రోజు నాడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడనేది ఎవరూ చెప్పట్లేదు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి ఒక అప్డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చాలా రోజుల ట్రీట్మెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడినట్లు తెలుస్తుంది. డిశ్చార్జి తర్వాత లేచి కూర్చోవడమే కాదు.. మెల్లగా నడుస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ఇంటికి వెళ్లి మరి టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ఆయన్ను కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా ట్విటర్లో ఒక ఫొటోను కూడా పంచుకున్నాడు. నా తమ్ముడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫుల్లీ.. మళ్లీ లోడెడ్ అంటూ చేతిలో చేయి కలిపి ఉన్న ఫొటోను హరీశ్ శంకర్ పోస్టు చేశాడు. దీంతో మెగా హీరో పూర్తిగా కోలుకున్నట్టేనని ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పుడు తేజ్ ఆరోగ్యం గురించి మరింత సమాచారం వచ్చింది. సాయి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని.. త్వరలోనే ఈయన బయటికి రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రాబోయే రెండు వారాల్లోనే సాయి ధరమ్ తేజ్ బయటికి వస్తాడని మెగా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తమ హీరో పూర్తిగా కోలుకున్నాడని.. ఇక ఆయన ఆరోగ్యం గురించి ఎవరినీ అడిగే అవసరమే లేదని సంతోషిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఇంట్లోనే ఫిజియోథెరపీతో పాటు పలు ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. వీలైనంత త్వరగా కోలుకుని షూటింగ్స్‌కు రావాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు తేజు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొనేది ఎప్పుడంటే..?
Tamannaah: తమన్నా వలన ఐదు కోట్లు నష్టపోయాం: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు
రాధే శ్యామ్ వ్యూస్ తగ్గడంపై స్పందించిన యూట్యూబ్
పెళ్లి చేసుకోవాలని ఉన్నా, ఇలియానాకి వరుడు దొరకట్లేదట..!
తెల్ల పిల్లని పెళ్లి చేసుకోనున్న మనోజ్.. వార్తలపై ఆయన స్పందన ఏంటి ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

