బిగ్ బాస్ హౌజ్‌లో జంటగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సిరి-షణ్ముఖ్ జంట. వీరిద్దరు చేసే రచ్చకు అందరు షాక్ అవుతున్నారు. సిరి అయితే షణ్ముఖ్‌ని వదిలి పెట్టడం లేదు. ఎంత తిట్టినా ఆయన దగ్గరకే వెళుతుంది. అలానే సందర్భానుసారం ముద్దులు కూడా ఇచ్చేస్తుంది. శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ నాగ్ చూపించగా, అందులో సన్నీ మీద ఉన్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది.
వీరి వ్యవహారం చూసి ఇది ఎక్కడకో పోతుందని అంటున్నారు. ఇక సన్నీ.. మానస్ దగ్గర కూర్చుని ఆడాళ్లకి ఒక రూల్.. మగాళ్లకి ఒకరూల్నా షర్ట్ పట్టుకుని లాగింది.. మనం అయితే ఆడపిల్లల డ్రెస్ పట్టుకోగలమారా? అని సన్నీ అంటే.. పట్టుకో అని అంటుంది కదా.. అని అన్నాడు మానస్. ఆ అమ్మాయి నోరు ఎంత దారుణంగా జారుతుందో అని మానస్ అంటే.. అంత గలేజ్గా మాట్లాడే అమ్మాయిని ఇంత వరకూ చూడలేదు అని అన్నాడు సన్నీ.
అసలు ఎన్నిసార్లు సిరి నన్ను బ్యాడ్ చేస్తుందని సన్నీ.. కాజల్, మానస్, ప్రియాంకల దగ్గర బాధపడ్డాడు. నేను అసలు షణ్ముఖ్ జోలికి వెళ్లానా? ఆమె నా మీదికి వస్తుంటే.. మధ్యలో షణ్ముఖ్ ఎందుకు వస్తున్నాడు. కావాలనే నన్ను రెచ్చగొడుతున్నాడు.. ఫిజికల్‌గా ఏదో విధంగా గొడవపెట్టుకోవడానికే చూస్తున్నాడు అని సన్నీ అన్నాడు.