Lamine Yamal : ఫిఫా వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన లియోనల్ మెస్సీ(Lionel Messi) యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే.. మెస్సీ తన ఐడల్ మాత్రం కాదంటున్నాడు లామినే యమల్(Lamine Yamal). నాలుగేళ్ల క్రితం ఖతార్ ఎడిషన్‌లో మెరుపు ఆటతో వార్తల్లో నిలిచిన యమల్.. మెస్సీని ఉత్తమ ఫుట్‌బాలర్ అని చెప్పాడు. కానీ, తాను ఆరాధించే ఆటగాడు మాత్రం అతడు కాదని సెలవిచ్చాడు.
ప్రపంచ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం గొప్ప ఆటగాళ్లు ఎవరంటే.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. వీరి ఆట ఘనమే కావొచ్చు.. కానీ, తనకు మాత్రం బ్రెజిల్ స్టార్ నెయ్మర్ అట నచ్చుతుందని లామినే యమల్ అంటున్నాడు. మెస్సీ, రొనాల్డోలు గొప్ప ఆటగాళ్లు అయినప్పటికీ తనకు నెయ్మర్ స్ఫూర్తి అని చెబుతున్నాడీ యంగ్‌స్టర్.
🇪🇸 Lamine Yamal on Lionel Messi’s hat-trick:
🗣️ “Every match he plays proves that he is the greatest player in history. If some people still have doubts, it’s because they’re deliberately looking for them…
There’s nothing more to add. My idol is Neymar, but Messi is the… pic.twitter.com/oK61zTdYPh
— Football Tweet ⚽ (@Footballtweet) June 19, 2026
‘మెస్సీ ఎంత గొప్ప ప్లేయరో ప్రతి మ్యాచ్ చెబుతుంది. ఎవరికి ఏమైనా సందేహాలు ఉంటే మెస్సీనే ఆశ్రయిస్తారు. మెస్సీ గొప్ప ఆటగాడే. నా ఐడల్ మాత్రం నెయ్మర్ అంటున్న యమల్ వరల్డ్‌కప్‌లో 25 నిమిషాలు ఆడాడంతే. కేప్ వెర్డే జట్టుతో ఆడిన యమల్ .. మేనేజర్ అనుమతిస్తే మరిన్ని మ్యాచ్‌లు ఆడుతాన’ని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.