Biggboss Prize Money | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8) మరికొన్ని గంటల్లో ముగియనున్న విషయం తెలిసిందే. 15 వారాలుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఈ షో నేడు గ్రాండ్ ఫినాలే జరుపుకుంటుంది. 22 మంది కంటెస్టెంట్లు పాల్గోన్న ఈ షోలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇందులో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ గ్రాండ్ ఫినాలేకు చేరుకోగా.. టైటిల్ విన్నర్ ఎవరు అనేది నేడు తెలియనుంది. ఈ ఐదుగురు కంటెస్టెంట్లలో నిఖిల్‌తో పాటు గౌతమ్‌ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. గౌతమ్ టైటిల్ విన్నర్‌గా నిలవబోతున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యేవారికి సంబంధించిన ప్రైజ్‌మనీని నాగార్జున రివీల్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దాదాపుగా రూ. 54.99, 999 లక్షల వరకు ప్రైజ్ మనీ రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రైజ్‌మనీకి నాగార్జున ఒక్క రూపాయి యాడ్ చేస్తూ.. రూ.55 లక్షల ప్రైజ్ మనీ అని తెలిపారు. ఈ ప్రైజ్‌మనీతో పాటు విన్నర్‌కు మారుతి కారు కూడా బహుమతిగా అందుకోబోతున్నట్లు సమాచారం.