చింతా పృథ్వీచరణ్, చంద్రదిత్య, భాస్కరశర్మ, రూప, కావ్య కీర్తి, గౌతమి ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ వీకెండ్’. కారాడి వెంకటేశ్వర్లు తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రాధాకృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నూతన నటీనటులతో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్.