ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు.. బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘హోంటౌన్’. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలు. ఏప్రిల్ 4న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సిరీస్ ట్రైలర్‌ని అగ్రహీరోగా విజయ్ దేవరకొండ మంగళవారం విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘బ్రతుకుతెరువు కోసం సొంతూర్లను విడిచిపెట్టినా.. ఊరి జ్ఞాపకాలు మాత్రం మనల్ని విడిపెట్టవ్. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ సిరీస్ ఉంటుంది’ అని మేకర్స్ చెబుతున్నారు. కుటుంబ సంఘర్షణల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగింది. రాజీవ్‌కనకాల, ఝాన్సీ, అనీ.. తదితరులు ట్రైలర్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దేవ్‌దీప్ గాంధీ కుండు, సంగీతం: సురేష్ బొబ్బిలి.