Hi Nanna Movie | టైటిల్ పోస్టర్ నుంచి పాజిటీవ్ వైబ్స్ ఏర్పరుచుకున్న సినిమా హాయ్ నాన్న. దసరా వంటి మాస్ కమర్షియల్ సినిమా తర్వాత నాని తన కంఫర్ట్ జానర్ అయిన క్లాస్ కథతో వస్తున్నాడు. ఈ సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రోమోలు ఫ్యామిలీ ఆడియెన్స్ మంచి హైప్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించినా.. సలార్ రాకతో పోస్ట్ పోన్ అయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌తో సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. ప్రాణంగా పెంచుకుంటున్న కూతురు. తల్లి లేని లోటును తీరుస్తూ.. అడిగిందల్లా ఇచ్చే ఒక నాన్న. కూతురు ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి. స్నేహంతో మొదలైన ఆ అమ్మాయి బంధం ప్రేమ వరకు దారితీస్తుంది. పైగా కూతురుకు కూడా అమ్మాయి బాగా అలవాటైపోతుంది. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్న హీరోకు అప్పటికే అమ్మాయికి వేరొకరితో ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిసి హీరో గుండె బద్దలవుతుంది. మరోవైపు హీరోయిన్‌కు అప్పటికే హీరోతో, పాపతో బలమైన బంధం ఏర్పడుతుంది. ఓ వైపు వేరొకరితో పెళ్లి, మరో వైపు హీరోతో ప్రేమ ఆ తర్వాత ఏం జరిగింది.
టీజర్ చూస్తుంటే మంచి ఫిల్టర్ కాఫీలాంటి సినిమా అనిపిస్తుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి గురించి చూపిస్తూనే.. మరోవైపు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కూతురు గురించి కూడా టీజర్లో చూపించారు. మరీ ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వాహద్ సంగీతం మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. విజువల్స్ సైతం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. దసరా తర్వాత ఇంత క్లాస్ సబ్జెక్ట్ ఎంచుకోవడం అంటే నాని గట్స్‌కు మెచ్చుకోవాల్సిందే. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. నానికి జోడీగా సీతారామం బ్యూటీ మృనాళ్ థాకూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.