విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. హీరో విక్రాంత్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో స్పెర్మ్‌కౌంట్‌ను వంద రోజుల్లో పెంచుకోవడం ఎలా? అనే పుస్తకాన్ని పట్టుకొని హీరో విక్రాంత్ కనిపిస్తున్నాడు.
ఓ సమకాలీన సమస్యను చర్చిస్తూ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని దర్శకుడు జీవన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నదని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగుల, సంగీతం: సునీల్‌కశ్యప్, సంభాషణలు: కల్యాణ్ రాఘవ్, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.