Sharwanand | హీరో శర్వానంద్ బుధవారం పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త చిత్రాలను ప్రకటించారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. బుధవారం రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
శర్వానంద్ 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. లండన్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇక శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం ప్రారంభమైంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం లో శర్వానంద్ బైక్ రైడర్‌గా కనిపిస్తారు.