పెళ్లి సందD క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేశాయి.. శ్రీకాంత్ తనయుడు మెప్పించాడుగా..

Pelli sandaD movie collections | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతోనే రాఘవేంద్రరావు నటుడిగా మారాడు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తొలిరోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ ప్రభావం కలెక్షన్ల మీద పడలేదు. హీరోయిన్ శ్రీ లీల గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో పెళ్లి సందD కంటే పిల్ల సందడే ఎక్కువ ఉందంటూ కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తం మీద సినిమాకు కలిసి వచ్చింది. ఇప్పుడు పెళ్లి సందD సినిమా క్లోజింగ్ కలెక్షన్లు వచ్చాయి. మరి పెళ్లి సందD సినిమాకు ఏరియా వైజ్‌గా కలెక్షన్లు ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాం..
నైజాం: 2.08 కోట్లు.
సీడెడ్: 1.55 కోట్లు.
ఉత్తరాంధ్ర: 1.06 కోట్లు.
ఈస్ట్: 0.53 కోట్లు.
వెస్ట్: 0.40 కోట్లు.
గుంటూరు: 0.64 కోట్లు.
కృష్ణా: 0.45 కోట్లు.
నెల్లూరు: 0.35 కోట్లు.
ఏపీ+తెలంగాణ(టోటల్): 7.06 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్: 0.60 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 7.66 కోట్లు.
పెళ్లి సందD సినిమాకు రూ.7.20 కోట్లబిజినెస్ జరిగింది. చాలా చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో 5.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దిగిన ఈ చిత్రం రూ.7.66 కోట్ల షేర్ ను సాధించింది. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్లకు రూ.2.46 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఓటీటీలోకి వచ్చేస్తున్న పెళ్లి సందD చిత్రం…!
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
పుష్పలో సునీల్ పోస్టర్ జస్ట్ టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..
కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెంపుడు కుక్కలు..
ఫిజిక్‌పై ఫోకస్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్‌కు వచ్చేదప్పుడే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

