పుష్పలో సునీల్ పోస్టర్ జస్ట్ టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..

sunil as mangalam srinu in pushpa movie |ఇన్ని రోజులు సునీల్ అంటే కమెడియన్ మాత్రమే గుర్తుకొచ్చేవాడు. ఇప్పుడు సునీల్ పేరు తలచుకుంటేనే భయం పుడుతుంది. నటుడిగా అలా తనను తాను మార్చుకున్నాడు ఈ భీమవరం బుల్లోడు. కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారి.. ఇప్పుడు విలన్‌గా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. తాజాగా పుష్ప సినిమాలో సునీల్ మంగళం శ్రీను లుక్ చూసిన తర్వాత అందరూ ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాలో ఇద్దరు ప్రతినాయకులు ఉండబోతున్నారు. ఇందులో మెయిన్ విలన్‌గా మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కన్ఫార్మ్ అయ్యాడు. ఇక బాహుబలి సినిమా తరహాలో పుష్పలో కూడా ఒక కట్టప్ప ఉంటాడని.. వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచే పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రతోనే పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవుతుందని.. ఎందుకు వెన్నుపోటు పొడిచాడు.. ఏం జరిగిందనేది చెప్పడమే రెండో భాగమని ప్రచారం జరుగుతోంది. ఈ కట్టప్ప ఎవరో కాదు సునీల్.
ఇరవై ఏండ్ల సినీ కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలో నటించిన సునీల్.. పుష్ప సినిమాలో మాత్రం చాలా సీరియస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. మంగళం శ్రీను గా ఆయన నటిస్తున్నాడు. ఇందులో సునీల్ భార్య పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా సునీల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు ఈయన అభిమానులు. మరోవైపు సునీల్ కూడా తాను ఎదురుచూసింది కూడా ఇలాంటి పాత్ర కోసమే అంటున్నాడు. తాజాగా మంగళం శ్రీనుగా ఆయన గెటప్ చూసిన తర్వాత సినిమాలో ఎంత క్రూరంగా సునీల్ క్యారెక్టర్ ఉండబోతుందో ఊహించుకోవచ్చు. కచ్చితంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత సునీల్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతక పకడ్బందీగా, క్రూరంగా సునీల్ పాత్రను చిత్రీకరిస్తున్నాడు సుకుమార్. ఏదేమైనా కూడా పుష్ప సినిమాలో వెన్నుపోటు ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుందని ప్రచారం జరుగుతుంది. రష్మిక మంధన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
సునీల్ ‘అందాల రాముడు’ ముందుగా ఎవరు చేయాల్సిందో తెలుసా..?
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్‌ను విలన్‌గా మారుస్తున్న త్రివిక్రమ్
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

