ఫిజిక్‌పై ఫోకస్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్‌కు వచ్చేదప్పుడే..!

Sai dharam tej | సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. బయటికి ఎప్పుడు వస్తున్నాడు.. అని కొన్ని రోజులుగా మెగాభిమానులు అడిగేవాళ్లు. ఇప్పుడు సాయి బయటికి వచ్చాడు. ఆయనెలా ఉన్నాడో మొన్న దీపావళి రోజు ఓ పిక్ విడుదల చేశారు. తేజ్ ఫోటో చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆయన పూర్తిగా కోలుకున్నాడంటూ చిరంజీవి కూడా చెప్పుకొచ్చాడు. ఈ రోజు మాకు నిజమైన పండగ అంటూ చాలా ఎమోషనల్ అయింది మెగా ఫ్యామిలీ. మేమంతా ఒక్కటే అని సాయిధరమ్ తేజ్ విషయంలో మరోసారి నిరూపించారు.

యాక్సిడెంట్ అయిన తర్వాత 50 రోజులకు కానీ సాయి కోలుకోలేదంటే ఆయనకు జరిగింది ఎంత పెద్ద ప్రమాదం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడింది. లేచి నిలబడటమే కాదు.. చక్కగా నడుస్తున్నాడు కూడా. ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఇప్పుడు సాక్ష్యం కూడా కనిపించింది. తాజాగా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. లేచి కూర్చోవడమే కాకుండా.. మెల్లగా నడుస్తున్నాడని తెలుస్తుంది. తనపై.. తన సినిమా రిపబ్లిక్‌పై మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అని.. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ అప్పట్లో ట్వీట్ చేశాడు సాయి. నా పునర్జన్మకు కారణమైన అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఈ మధ్యే మరో ట్వీట్ కూడా చేశాడు సాయి ధరమ్ తేజ్. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే ఫిజియో తెరపీతో పాటు పలు ఎక్సర్ సైజులు కూడా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. వీలైనంత త్వరగా కోలుకుని షూటింగ్లో పాల్గొనాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు తేజు.
మొన్న దీపావళి రోజు సాయిధరమ్ తేజ్‌ను చూసిన తర్వాత అభిమానులు ఒక్క విషయంలో మాత్రం ఫీల్ అయ్యారు. గతంలో బొద్దుగా ఉన్న సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు మాత్రం చాలా బక్కగా మారిపోయాడు. బరువు తగ్గిపోయి పీలగా కనిపిస్తున్నాడు. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత కచ్చితంగా మనుషులు అలాగే మారిపోతారని వైద్యులు కూడా చెప్తున్నారు. కొన్ని రోజులు అయితే అంతా సెట్ అయిపోతుందని.. సాయిధరమ్ తేజ్ మళ్లీ మామూలుగా అయిపోతాడని చెప్తున్నారు. తేజ్ కూడా ఇప్పుడు తనను తాను మార్చుకోవడానికి ఎక్సర్సైజ్లు మొదలుపెట్టాడు. మునపటి ఫిజిక్ కోసం వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 10న ఈయన బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో సాయికి యాక్సిడెంట్ అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్.. ప్రమాదం తర్వాత తొలి ఫొటో
Nithiin | మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు నితిన్ !!
ఓటీటీలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా.. ఎప్పట్నుంచి అంటే..
Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొనేది ఎప్పుడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

