Maa elections | అసలు మా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
Maa elections Process | మా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులో ఎవరు మా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో అసలు మా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? మా అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? వంటి వివరాలు ఒకసారి చూద్దాం..

ఓటింగ్ ఎలా జరుగుతుంది
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా) కార్యవర్గం కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ కార్యవర్గంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ సభ్యులతో కలిపి 26 మందిని ఈ ఎన్నికలతో ఎన్నుకుంటారు. అంటే ఈ 26 మందిని ఎన్నుకోవడం కోసం ఒక్కో ఓటర్ 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే.. తమకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నాడో చూసుకుని అతనికి ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు రెండు ప్యానెళ్లు మాత్రమే పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఓటర్‌కు పెద్ద గందరగోళం ఉండదు. అదే ఎక్కువ ప్యానెళ్లు పోటీ పడినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. 2015లో మా అధ్యక్ష ఎన్నికలను తొలిసారిగా ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మా అసోసియేషన్‌లో 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
అధ్యక్షుడి ఎంపిక ఎలా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 26 మంది కార్యవర్గ సభ్యుల కోసం జరిగే ఓటింగ్‌లో ఒక్కో ఓటర్ 26 ఓట్లు వేస్తారు. అలా మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈసీ సభ్యుడి నుంచి మా అధ్యక్షుడి వరకు అందరినీ ఇలాగే ఎన్నుకుంటారు. ఇక్కడ కార్యవర్గం మొత్తం ఒకే ప్యానెల్ నుంచి ఎన్నికైతే ఫర్వాలేదు. అలా కాకుండా వేర్వేరే ప్యానెల్ నుంచి అభ్యర్థులు గెలిస్తే.. వారంతా కలిసి ఒకే ప్యానెల్‌గా మారతారు. అధ్యక్షుడిగా ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ల ఆధ్వర్యంలోనే మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది.
పోటీలో ఉన్నది వీళ్లే..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
Manchu vishnu | విమానంలో వచ్చి మరి ఓటు వేసి వెళ్తారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
Manchu vishnu | నాగబాబును అంకుల్ అంటూనే.. మంచు విష్ణు కౌంటర్
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
MAA: మా ఎన్నికలలో ఓటు వేయనని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
మా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి



