Balakrishna | బాబీ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేసే దర్శకుడు అతడే..
బాబీ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేసే దర్శకుడెవరు? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. కొందరు బోయపాటి ‘అఖండ 2’ అంటారు.
Balakrishna | బాబీ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేసే దర్శకుడెవరు? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. కొందరు బోయపాటి ‘అఖండ 2’ అంటారు. మరికొందరు మలినేని గోపీచంద్ అంటున్నారు. ఇప్పుడు మూడో పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఆ పేరు ఎవరిదోకాదు. మాస్ సినిమాల దర్శకుడు హరీశ్శంకర్దే. త్వరలో తను బాలయ్యను డైరెక్ట్ చేయనున్నారట.
ఫిల్మ్‌వర్గాల సమాచారం ప్రకారం ‘అఖండ-2’ కంటే ముందే హరీశ్‌శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం హరీశ్‌శంకర్ అటు పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ఇటు రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బాబీ సినిమాకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ప్రచారంలో బాలయ్య బిజీగా ఉన్నారు.
ఎన్నికల వేడి తగ్గాక, ‘బాబీ’ సినిమా షూటింగ్‌లోకి ఎంటర్ అవుతారు బాలకృష్ణ. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత హరీశ్‌శంకర్ సినిమా మొదలవుతుందని తెలుస్తున్నది. ఇటీవలే బాలకృష్ణకి హరీశ్‌శంకర్ ఓ కథ వినిపించారని, బాలయ్య సూచనల మేరకు కథలో చిన్నచిన్న మార్పులు చేసే పనిలో హరీశ్‌శంకర్ ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
మిరపకాయ్, గబ్బర్‌సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించిన హరీశ్‌శంకర్.. బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

