Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్
Ustaad Bhagat Singh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Ustaad Bhagat Singh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022లోనే మొదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై హరీశ్ శంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఎక్స్‌లో ఒక నెటిజన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఆగిపోనుందంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి హరీశ్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా స్టార్ట్ కానప్పుడే ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు. నా దృష్టి ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పైనే వుంది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
-
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓఎస్డీగా కడప ఆర్డీవో.. ఆయనే ఎందుకంటే..!
-
Rohit Sharma | వరల్డ్ కప్ వీరుడికి అపూర్వ స్వాగతం.. వీడియో వైరల్
-
UK PM | బ్రిటన్‌లో మార్పు మొదలైంది.. పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తాం : కీర్ స్టార్మర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

