Puri Jagannath – Harish Shankar | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ ఏ ముహూర్తాన వాయిదా పడిందో కానీ అప్పటినుంచి ఆ డేట్ కోసం టాలీవుడ్‌తో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు క్యూ కట్టిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప ఆగష్టు 15న విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్ 06వ తేదీకి వాయిదా వేశారు. అయితే పుష్ప పక్కకి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ వచ్చి చేరింది.
అయితే ఈ సినిమా సోలోగా విడుదల అవుతుంది ఈ ఇండిపెండెన్స్‌కి అని అంతా అనుకున్నారు. కానీ ఎటునుంచి వచ్చిందో తెలిదు. వైల్డ్ కార్డ్‌లా ఎంట్రీ ఇచ్చింది రవితేజ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా కూడా ఆగష్టు 15న బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే తమిళం నుంచి తంగలాన్ కూడా వస్తుంది. దీంతో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వబోతున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే తమిళం నుంచి వస్తున్న తంగలాన్ తెలుగులో ఎఫెక్ట్ చూపకపోయిన డబుల్ ఇస్మార్ట్ – మిస్టర్ బచ్చన్ రెండు ఢీకొట్టే అవకాశముంది.
అయితే డబుల్ ఇస్టార్ట్ టీమ్.. బచ్చన్ టీమ్‌ను కలిసి మూవీని వాయిదా వేసుకోమని అడిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి బచ్చన్ టీం ఒప్పుకోకపోవడంతో నిర్మాత చార్మీ రవితేజతో పాటు మిస్టర్ బచ్చన్ దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం కూడా స్పందించలేదు. అయితే రీసెంట్గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో పాల్గోన్న హరీశ్ శంకర్ తాజాగా ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించాడు.
పూరి జగన్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుదల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ అడుగగా.. పూరితో నేను పోల్చుకోలేను. ఆయన ఒక దిగ్గజం. ఆయనతో నా సినిమా వస్తుండటం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావడం వెనుక ముఖ్య కారణం ఓటీటీ ఇష్యూ ఉండడం అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా.. అంతేకాని నాకు పూరి సర్కి ఎలాంటి గొడవలు లేవు. అంటూ హరీశ్ శంకర్ చెప్పుకోచ్చాడు.