Hari Hara Veeramalu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ వచ్చే వారం (జూలై 24) గ్రాండ్‌గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేమికులంతా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ గెటప్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ అన్ని నెక్ట్స్ లెవల్ అని అభిమానులు అంటున్నారు. ట్రైలర్ విడుదల తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
అయితే ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా తిరుపతిలో నిర్వహించాలనుకుంది చిత్ర బృందం. ఆ తర్వాత విజయవాడ అన్నారు. అనంతరం వైజాగ్ అంటూ ప్రచారం జరిగింది. కాని చివరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈవెంట్‌కి గెస్ట్‌గా పలువురు రాజకీయ నాయకులు, రాజమౌళి, త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ విడుదల అనంతరం సినిమా బిజినెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలకానుంది. పవన్‌కు పాన్-ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ సినిమాకు హైప్‌ను మరింత పెంచుతోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండడం, కోవిడ్-19 లాక్డౌన్లు తదితర కారణాల వల్ల మూవీ విడుదల ఆలస్యం అయ్యింది. అయినా అంచనాలు మాత్రం పీక్స్‌లోనే ఉన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. గతంలో పవన్‌తో కలిసి ‘ఖుషి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన ఆయన, మళ్లీ పవన్‌తో కలిసి పనిచేస్తుండటంతో ఫ్యాన్స్‌లో మంచి బజ్ నెలకొంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలం కానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అలాగే నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.