Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో టికెట్ బుకింగ్స్ మొదలవ్వగా.. తాజాగా తెలంగాణలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని గంటల్లో బుక్‌మైషోలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చిత్రయూనిట్ తెలిపింది.
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోవైపు ఈ సినిమా ప్రీమియర్ షోల(జూలై 23న రాత్రి 9:30)కు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు.