Allu Arjun | కేరళలో ‘హ్యాపీ’ హంగామా.. 20 ఏళ్ల తర్వాత కూడా అల్లు అర్జున్ క్రేజ్‌కు సాక్ష్యం ఇది!
Allu Arjun | మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, అంతకుముందే కేరళలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా రీ-రిలీజ్‌తో మరోసారి కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు.
Allu Arjun | మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, అంతకుముందే కేరళలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా రీ-రిలీజ్‌తో మరోసారి కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు.అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ‘హ్యాపీ’ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అప్పట్లో మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’ పేరుతో డబ్ చేశారు. తాజాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రాన్ని 4K వెర్షన్లో కేరళలో రీ-రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
సినిమా విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. పాటలు వస్తే డ్యాన్సులు చేస్తూ, విజిల్స్ వేస్తూ థియేటర్లను కేరింతలతో మార్మోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘హ్యాపీ’ రీ-రిలీజ్ తొలి రోజే సుమారు రూ.30 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇటీవల మలయాళంలో విడుదలైన కొన్ని భారీ పాన్ ఇండియా చిత్రాల ఓపెనింగ్స్‌ను కూడా ఈ సినిమా అధిగమించడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా రీ-రిలీజ్ ఇంతటి స్పందన పొందడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘ఆర్య’, ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’ వంటి చిత్రాల ద్వారా అల్లు అర్జున్ మలయాళ ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్సులు, మాస్ అప్పీల్ కేరళ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాలక్రమేణా ఆయనకు అక్కడ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడి, అభిమానులు ప్రేమగా ‘మల్లు అర్జున్’ అని పిలిచే స్థాయికి చేరుకున్నారు.ఇప్పుడు ‘హ్యాపీ’ రీ-రిలీజ్ విజయంతో మరోసారి కేరళలో అల్లు అర్జున్ మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపితమైంది. 20 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం, బన్నీ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- happy
- Kerala
- Mollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

