Mahesh Babu Birthday | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టినరోజును తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. సూపర్ స్టార్ డమ్‌తోపాటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు మహేశ్ బాబు. ఈ స్టార్ హీరోకు పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి హీరో మహేశ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes). తండ్రి నటశేఖర కృష్ణ అడుగుజాడల్లో వెళ్తూ.. విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన మహేశ్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేస్తూ.. సుదీర్ఘ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. బర్త్ డే సందర్భంగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ గుంటూరు కారం నుంచి కొత్త లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..