ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన భక్తిరసాత్మక చిత్రం ‘హనుమాన్ అంశ్’. అతితక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని అందుకున్నది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన తదితర అంశాలతో విశాల్ చతుర్వేది దర్శకత్వం వహిచిన ఈ చిత్రంలో కరోలీబాబా పాత్రలో శోబినావ్ సత్యా నటించారు.
చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ కీలకపాత్రధారులు. ఈ సినిమాకు సంబంధించిన సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కులను ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానున్నది. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
నీమ్కరోలీ బాబా జీవితంలోని ప్రధాన ఘట్టాలని ఆవిష్కరిస్తూ ట్రైలర్ సాగింది. భాషకు అతీతమైన కథ ఇదని, కరోలీ బాబాకు చెందిన విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఓ ఆసక్తికరమైన సినిమాటిక్ జర్నీగా ఈసినిమా ఆవిష్కరించిందని మేకర్స్ తెలిపారు.