hamida elimination from bigg boss 5 telugu | బిగ్ బాస్ ఒక్కో వారం అయిపోతుంటే.. షాకులు కూడా అలాగే తగులుతున్నాయి. అస్సలు ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. మూడో వారం లహరి ఎలిమినేషన్ ఇప్పటి వరకు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైల్డ్ కార్డు ఇచ్చి ఇవ్వడం ఇంట్లోకి పంపించాలి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే ఈ వారం కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ జరగింది. ఐదో వారం ఇంటి నుంచి హమీదా బయటకు వచ్చేసింది.
షూటింగ్ జరిగేది హైదరాబాద్‌లోనే కాబట్టి విషయం ముందుగానే బయటకు వచ్చేసింది. అయితే హమీదా ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి కోసం ఇంట్లో అందరినీ దూరం పెట్టడం ఆమెకు మైనస్‌గా మారింది. ప్రేక్షకులకు కూడా అదే నచ్చలేదు. ఇంట్లో అంత మంది సభ్యులు ఉంటే కేవలం శ్రీరామ్ మాత్రమే కావాలి అన్నట్టు గత రెండు వారాలుగా ప్రవర్తిస్తోంది హమీదా. మొదటి రెండు వారాలు అందరితో కలిసిపోయిన ఈ హీరోయిన్.. మూడో వారం నుంచి శ్రీరామ్ కు మాత్రమే కనెక్ట్ అయింది. ఆ సమయంలోనే ఇంటి సభ్యులకు డిస్ కనెక్ట్ అయింది.
ఇక శ్రీరామ్ కెప్టెన్ అయిన తర్వాత ఇంటి సభ్యులు హామీదాను పూర్తిస్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. రేషన్ మేనేజర్‌గా మారిన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు అందరికీ షాక్ ఇచ్చింది. ఇవన్నీ ఆమె ఎలిమినేట్ కావడానికి తోడ్పడ్డాయి. ఇంట్లో అందరితో కలిసి ఉండి ఆడితే ఓకే.. కానీ ఒకరి చుట్టూ భజన చేస్తే మాత్రం కచ్చితంగా అది నెగిటివ్‌గానే జనాల్లోకి వెళ్తుంది అనడానికి హమీదా ఎలిమినేషన్ నిదర్శనం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | ఇంట్లో అందరినీ ఇరిటేట్ చేయడమే ఆమె స్ట్రాటజీ..
Siri: సిరి హన్మంత్ పెళ్లి కాకుండానే తల్లి అయిందా?
Bigg Boss: రెండు రోజుల్లో ఆరు కేజీలు తగ్గి ఔరా అనిపించిన మానస్..!
Shanmukh: నీ స్కిట్లు బయట చేసుకో, ఇక్కడ కాదు.. రవిపై షణ్ముఖ్ ఫైర్