సారంగదరియా పాటతో గురువారం ఎపిసోడ్ ప్రారంభం కాగా, హౌజ్‌మేట్స్ అందరు చాలా ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. అనంతరం మెరుపుల శబ్ధం రాగానే బజర్ నొక్కిన శ్వేత.. సిరి-షణ్ముఖ్‌లను తమకు పోటీదారులుగా ఎంచుకున్నారు. ‘గెలవాలంటే తగ్గాలంతే’ టాస్క్‌లో భాగంగా.. ‘చిక్కులో చిక్కికోకు’ అనే టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్‌లో భాగంగా చిక్కుల్లో ఉన్న ఆరు తాడుల్ని ఎవరైతే మొదట చిక్కులు తీస్తారో వారే విజేతలని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సిరి, షణ్ముఖ్‌లు పూర్తిగా విఫలం కావడంతో శ్వేత, ఆనీ మాస్టర్లు విజేతలుగా నిలిచారు. గెలవాలంటే తగ్గలి టాస్క్‌లో మానస్- సన్నీ టీం విజయం సాధించింది. అయితే ఈ టాస్క్ కోసం మానస్ రెండు రోజుల్లోనే ఆరు కిలోల బరువు తగ్గి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు.
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రెండు రోజుల పాటు ఫుడ్ లేకుండా చేసిన బిగ్ బాస్.. ఇంటి సభ్యులు అందరికీ పిజ్జా, కూల్ డ్రింక్, స్వీట్స్‌ని పంపించారు. దీంతో రెండు రోజుల తరువాత తమకి తినడానికి మంచి ఫుడ్ పంపించారని కెమెరా ముందు ఆనందం వ్యక్తం చేశారు సన్నీ, మానస్లు. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కి సన్నీ-మానస్, ఆనీ- శ్వేతా, శ్రీరామ్-హమీదా జంటలు ఎంపిక కావడంతో వీరిలో ఎవరు కెప్టెన్ పోటీదారులుగా ఉంటారో తేల్చుకోవాలని బిగ్ బాస్ అన్నారు.