ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ షోకి రాకముందు ఎవరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే హౌజ్‌లో అడుగుపెట్టి తమదైన శైలిలో గేమ్ ఆడుతున్నారో, అప్పటి నుండి వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం హౌజ్‌లో చలాకీ పిల్లగా పేరు తెచ్చుకున్న సిరి హన్మంత్ తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తొలి వారం కెప్టెన్సీ పదవిని పొంది ఔరా అనిపించింది.
యూ ట్యూబ్ స్టార్ సిరి హన్మంత్‌కు నటుడు శ్రీహాన్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మరి కొద్ది రోజులలో పెళ్లి చేసుకోవాలని భావించగా, బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ జోడీ ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్ చేసుకుంటున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా అందుకు సిరి హన్మంత్ అవునని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్‌గా మారింది.
మంచి నిర్ణయం తీసుకున్న సిరి- శ్రీహాన్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంటర్ అయిన యూట్యూబర్ సిరి హన్మంత్.. ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తోంది. బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.