Haiku Movie | గతేడాది ‘జో’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న విజన్ సినిమా హౌస్ బ్యానర్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘హైకూ’ నేడు ఘనంగా ప్రారంభమైంది. యంగ్ హీరో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కేరళలోని ఇడుక్కిలో ఫిబ్రవరి 1న వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు విలక్షణ దర్శకుడు రామ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు తన మద్దతు తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ తొలిరోజే ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమాలకు విడుదల తర్వాత డిజిటల్ క్రేజ్ వస్తుంది, కానీ ‘హైకూ’ చిత్రం షూటింగ్ పూర్తికాకముందే గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కథపై ఉన్న నమ్మకంతోనే నెట్‌ఫ్లిక్స్ ముందస్తుగా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఏగన్ సరసన ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్, శ్రీదేవి అప్పళ్ళ కథానాయికలుగా నటిస్తున్నారు. డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘జో’ ఫేమ్ హరిహరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, క్రేజీ స్టార్ కాస్ట్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.