Gurthunda Seethakalam Movie On Ott | కొన్ని సినిమాలను రీమేక్ చేయకపోవడమే బెటర్ అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఓరిజినల్ వెర్షన్ క్రియేట్ చేసిన మేజిక్.. రీమేక్ క్రియేట్ చేయదని, ఫీల్ మిస్సవుతుందని చెబుతుంటారు. అలాంటి సినిమాల్లో ‘గుర్తుందా శీతాకాలం’ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ క్రియేట్ చేసిన మేజిక్‌ను రీమేక్ సినిమా క్రియేట్ చేయలేకపోయింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమా ఆధరించలేకపోయారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ఈ సినిమా గతరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా, మేఘ ఆకాష్‌లు నటించారు. నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాల భైరవ సంగీతం అందించాడు. కాగా ఓరిజినల్ వెర్షన్ ‘లవ్ మాక్‌టైల్’ కూడా అమెజాన్లోనే ఉంది.