Guntur Kaaram | ‘గుంటూరు కారం’.. కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే
Guntur Kaaram | సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Guntur Kaaram | సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పూర్తి లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం సమకుర్చాడు.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

