నటి దిశా పటానీ ఇంటిపై శనివారం కాల్పులు జరిగాయి. తెల్లవారు జామున 3.30 గం.ల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి సుమారు 8 నుంచి 10 రౌండ్లు కాల్పులు జరిపారని దిశాపటానీ తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీష్ పటానీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ బరేలీలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. దిశా పటానీ స్వగృహం అక్కడే కావడం గమనార్హం.
ఇదిలావుంటే.. ఈ దాడి చేసింది తామేనంటూ హిందూ అతివాద సంస్థ ‘గోల్డీ బ్రార్’ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. తమ ముఠా సభ్యులైన వీరేంద్ర చరణ్, మహేంద్ర శరన్ ఈ దాడికి పాల్పడ్డారని, సాధువులు ప్రేమానంద్ జీ మహరాజ్, అనిరుధ్ ఆచార్య జీ మహారాజ్లను దిశా పటానీ అవమానించిందని, సనాతన ధర్మాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నించిందని, అందుకే ఈ కాల్పులు జరిపామని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.