Mrunal Thakur | అలాంటి కథ వినలేదు!
“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.
“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ చిత్రంలో అందం, అభినయం కలబోసిన సీత పాత్రలో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుందీ భామ. ప్రస్తుతం ఈ సొగసరి హిందీలో ‘గుమరాహ్’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ వంటి భారీ విజయం తర్వాత కూడా మరో సినిమాకు గ్యాప్ రావడానికి గల కారణాల్ని వివరించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది. కెరీర్లో తాను విన్న కథల్లో ఇదే అత్యుత్తమమైనదని ఆనందం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. తెలుగులో నాకు మరో గొప్ప చిత్రమవుతుంది’ అని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. నూతన దర్శకుడు సౌరవ్ రూపొందిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. నాని నటిస్తున్న 30వ చిత్రమిది కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

