Gopichand | క్రేజీ టాక్.. శ్రీను వైట్ల-గోపీచంద్ కాంబినేషన్ ఆన్ ది వే.. !
Gopichand | మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మరోవైపు గోపీచంద్ సూపర్ కామిక్ టైమింగ్ ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడని చాలా కాలంగా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.
Gopichand | మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. గోపీచంద్ 31 (Gopichand 31)గా రాబోతున్న ఈ చిత్రానికి భీమా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ సూపర్ కామిక్ టైమింగ్ ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడని చాలా కాలంగా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.
గోపీచంద్, శ్రీను వైట్ల (Sreenu Vaitla) సినిమా త్వరలోనే గ్రాండ్‌గా లాంఛ్ కానుందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. శ్రీనువైట్ల సినిమాలంటే కామెడీ టచ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రిపీటెడ్ ఆడియెన్స్ ఉండే సినిమాలు తీయడంలో శ్రీనువైట్ల రూటే సెపరేటు. అయితే చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్‌ను డిఫరెంట్ అవతార్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. మరి దీనిపై గోపీచంద్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
చాలా రోజుల క్రితం మంచు విష్ణుతో ఢీ 2 (Dhee 2) సినిమాను ప్రకటించాడని తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. మరి శ్రీనువైట్ల మొదట లాంఛ్ చేసిన విష్ణు సినిమాను పూర్తి చేస్తాడా..? లేదంటే గోపీచంద్ సినిమాపై ఫోకస్ పెడతాడా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భీమా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. భీమాకు స్వామి జే సినిమాటోగ్రాఫర్.
భీమా ఫస్ట్ లుక్ టీజర్..
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

