పక్కా కమర్షియల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. గోపీచంద్ వచ్చేది అప్పుడే..!

pakka commercial release date | యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్.. ఇప్పుడు కమర్షియల్ రేంజ్ మరింత పెంచుకోవడానికి పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మినిమమ్ గ్యారంటీ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండటంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్లుగా ముందుకు సాగుతున్న గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ , యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. ఈ టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధారణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్య స్పందన లభించడం విశేషం. ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు.
వచ్చే ఏడాది మార్చి 18న పక్కా కమర్షియల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయాలతో అపజయమే లేని గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ , బన్నీ వాసు కాంబినేషన్లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. పైగా ఈ బ్యానర్స్ నుంచి వచ్చిన భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే సినిమాలకు మారుతినే దర్శకత్వం వహించడం విశేషం. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనున్నారు. మంచిరోజులు వచ్చాయి సినిమాతో ఊహించని విధంగా దెబ్బ తిన్నాడు మారుతి. ఈ సినిమాకు దర్శకుడిగా పేరు వేసుకుని తప్పు చేశాడు అంటూ ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో పక్కా కమర్షియల్ సినిమాతో తన రేంజ్ చూపించడానికి వస్తున్నాడు ఈ దర్శకుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
ఒక ప్రొడ్యూసర్ నా నడుం మీద చపాతీ కాలుస్తానన్నాడు.. గుర్తుచేసుకున్న బోల్డ్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

