సాధారణంగా ఏదైనా సినిమా గురించి తెలుసుకోవాలంటే మూవీ లవర్స్, నెటిజన్లకు వెంటనే గుర్తొచ్చేది గూగుల్. సినిమా, హీరోహీరోయిన్లు, ఇతర అప్డేట్స్ ను గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అలా ఈ ఏడాది సినీ జనాలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఏంటో గూగుల్ ఇండియా (Google India) వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలు ఎంటనే కదా మీ డౌటు.
ఈ జాబితాలో టాప్‌లో బాలీవుడ్ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర (Brahmastra) నిలిచింది. రణ్‌బీర్ కపూర్-అలియా భట్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం మోస్ట్ సెర్చ్డ్ మూవీ- 2022 (Year In Search 2022)గా నిలిచింది. మూవీస్ కేటగిరీలో బ్రహ్మాస్త్ర తర్వాత కేజీఎఫ్ 2 టాప్‌లో నిలిచింది. అంతేకాదు ఈ రెండు చిత్రాలు టాప్ గ్లోబల్ ట్రెండింగ్ మూవీ సెర్చింగ్ జాబితాలో కూడా ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు గూగుల్‌లో సెర్చ్ చేస్తూ.. ఎంజాయ్ చేసిన ఇండియన్స్ సాంగ్స్ జాబితాలో ఆదిత్య ఏ సూపర్ హిట్ ట్రాక్ చాంద్ బాలియాన్, పుష్ప తమిళ వెర్షన్ శ్రీవల్లి పాటలు ఉన్నాయి.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. బ్రహ్మాస్త్ర.. పార్ట్ 2 : దేవ్లో పాపులర్ స్టార్ హీరోలు కనిపించబోతున్నట్టు సమాచారం. కాగా మరోవైపు సెర్చ్డ్ సాంగ్స్ జాబితాలో పుష్ప చిత్రానికి సీక్వెల్ పుష్ప.. ది రూల్ కూడా రెడీ అవుతుంది.
Read Also : Waltair Veerayya | చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్
Read Also : Gayathrie Shankar | విక్రమ్ నటి గాయత్రి శంకర్‌కు అరుదైన అవార్డు
Read Also : SSMB28 | ముంబైలో డిన్నర్.. దుబాయ్‌కు ఎస్ఎస్ఎంబీ 28 టీం