S.S.Rajamouli In Golden Globe Awards | ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక దిగ్గజం రాజమౌళి. గతేడాది మార్చిలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి సంచలనం సృష్టించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసాడి గతేడాది హైయ్యెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. కమర్షియల్‌గానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది. హాలీవుడ్ దిగ్గజాల మధ్య కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు.
ఇక ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్‌పై స్టైలిష్ లుక్స్‌తో సందడి చేశారు. అయితే రాజమౌళి మాత్రం పూర్తిగా ట్రెడీషనల్ లుక్‌లో వెళ్లి అందరిని ఆశ్యర్య పరిచాడు. బ్లాక్ సిల్క్ కుర్తాతో, ఎరుపు రంగు ధోతి,కండువా ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. సినిమాతోనే కాదు, డ్రెసింగ్ స్టైల్‌తోనూ జక్కన్న హాలీవుడ్ ప్రేక్షకులతో ఔరా అనిపించుకుంటున్నాడు. తారక్ బ్లాక్ కలర్ పాంట్కు వైట్ షర్టు వేసి పైన బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించి మరింత స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు రామ్‌చరణ్ అవుట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటున్నాడు. కీరవాణి కూడా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చాడు. ఇలా ఆర్ఆర్ఆర్ బృందం రెడ్ కార్పెట్‌పై డ్రెస్సింగ్ స్టైల్‌తోనూ అదరగొట్టింది.