God Movie Trailer | పొన్నియిన్ సెల్వన్ (Pooniyan Selvan) పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది. ఎండ్రెండ్రుం పున్నాగై (Endrendrum Punnagai), మనితన్ (Manithan), వామనన్ (Vamanan) చిత్రాల ఫేమ్ ఐ. అహ్మద్ (I.Ahmed) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో ‘గాడ్’ (God) పేరుతో డబ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ను గమనిస్తే.. బ్రహ్మ అనే మోస్ట్ వాంటెడ్ సైకో కిల్లర్ పది హత్యలు చేసి జైలులో ఉండగా అతడిని జయం రవి జైలు నుంచి తప్పిస్తాడు. ఇక బ్రహ్మను ఎందుకు తప్పించాడు. తరువాత ఎం చేస్తాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పవర్ ఫుల్ పోలిస్ పాత్రలో జయం రవి ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక అత్యంత డార్క్ థ్రిల్లర్గా ఈ చిత్రం రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#GOD Trailer 💥#IraivanTelugu https://t.co/IgNcRnoH9r
— Jayam Ravi (@actor_jayamravi) September 25, 2023
పాషన్ స్టూడియోస్ బ్యానర్ (Passion Studios)పై సుధన్ సుందరం & జయరామ్ జి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా (Yuvan Shanker Raaja) సంగీతం అందిస్తుండగా.. రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి, నరేన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.