Shiva Rajkumar | కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ (Shiva Rajkumar ) అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకుపైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు. ఇటీవలే జైలర్ సినిమాలో కామియోలో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు. ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘోస్ట్’(Ghost). ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ న్యూస్ అందించారు.
ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘ఘోస్ట్’ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 01 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. విజయదశమి కానుకగా.. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Brace Yourselves For MASSive Impact 💥 Big Daddy Of All Masses 🔥🔥
Explosive Trailer Of #Ghost On October 1st ❤️🔥
@NimmaShivanna @lordmgsrinivas @jayantilalgada @ArjunJanyaMusic @SandeshPro @TSeries @baraju_superhit #KarunadaChakravarthy #ShivaRajKumar #GhostOnOct19th… pic.twitter.com/nVPoVAvfKu— Shreyas Media (@shreyasgroup) September 27, 2023
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.