Ghani Movie On OTT | అప్పట్లో సినిమాలు థియేటర్లలో వంద నుంచి నూటయాభై రోజులకు పైగా ఆడేవి. ఇక ఆ సినిమా టీవీలో రావాలంటే కనీసం ఆర్నెళ్ళైనా పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఐనా సరే 4 నుంచి 5 వారాల్లోపే డిజిటల్లోకి వస్తుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘పుష్ప’ నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇటీవలే విడుదలై పరాజయం పాలైన ‘రాధేశ్యామ్’ రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా విడుదలైన ‘గని’ కూడా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలై డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. వరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా ఈ చిత్రం నిలిచింది. ఇక అప్పటికే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ ముందు ఈ చిత్రం నిలువలేక పోయింది. దాంతో పాటుగా ఈ తర్వాత వారం ‘బీస్ట్’, ‘కేజీఎఫ్’ వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలవడంతో ‘గని’ వారంలోపే థియేటర్లలో నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఏప్రిల్ 22నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.