Shyam Singha Roy Vs Ghani | గని నిర్మాతల తీరుతో శ్యామ్ సింగరాయ్ వెనకడుగేస్తాడా..?
టాలీవుడ్ (Tollywood)లో త్వరలో యువ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా వినోదాన్ని పంచనున్నాయి. ఈ రెండు సినిమాలని ఒకే తేదీన..అంటే డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

టాలీవుడ్ (Tollywood)లో త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. యువ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా వినోదాన్ని పంచనున్నాయి. ప్రస్తుతం సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో నాని (Nani) నటించిన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy), వరుణ్ తేజ్ (varuntej) నటించిన గని (Ghani )ముందు వరుసలో ఉన్నాయి.
అయితే ఈ రెండు సినిమాల ని ఒకే తేదీన..అంటే డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇపుడు దీనికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. రెండు సినిమాలు ఒకేసారి రావడం మార్కెట్ పరంగా సమస్యలు తీసుకువచ్చే అవకాశముందని భావించిన గని నిర్మాతలు విడుదల తేదీని మార్చాలని నానిపై ఒత్తిడి తెస్తున్నట్టు ఓ గాసిప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరోవైపు రిస్క్ తీసుకోవడం ఎందుకని గని నిర్మాతలే రిలీజ్ డేట్‌ను మార్చాలా..? అనే యోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు అప్డేట్స్ పై స్పష్టత లేకున్నా..ఇపుడు ఇండస్ట్రీలో చాలా మంది ఈ రెండు సినిమాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఒకేసారి విడుదలవుతాయా..? లేదంటే మేకర్స్ కాంప్రమైజ్ అయి వేరే తేదీలను ఫిక్స్ చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.
టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్‌సింగరాయ్ 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. నిహారిక ఎంటర్టైన్ మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ భామలు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. స్పోర్ట్స్ (బాక్సింగ్) బ్యాక్ డ్రాప్లో వస్తున్న గనిలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

