డిసెంబర్ 27 బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) డే అని స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. సల్లూభాయ్ సోమవారం 56వ పుట్టినరోజు (Salman Khan birthday)ను ఘనంగా జరుపుకున్నాడు. ముంబైకి సమీపంలో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడు సల్మాన్ ఖాన్. ఈ పార్టీకి సోనమ్ కపూర్, కత్రినాకైఫ్, మాధురీ దీక్షిత్, జెనీలియా డిసౌజా (Genelia DSouza ), రితేశ్ దేశ్ ముఖ్ తోపాటు పలువురు యాక్టర్లు హాజరయ్యారు.
సల్మాన్ ఖాన్ బర్త్ డే కేక్ కట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే బర్త్ డే పార్టీలో ఓ స్పెషల్ వీడియో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ అంత స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా..? జెనీలియా సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ మాస్ బీట్‌కు స్టెప్పులేసి అదరగొట్టింది. సల్మాన్, జెనీలియా రెడ్ షర్ట్ విత్ జీన్స్ కాంబినేషన్ లో ఒకేలా కనిపిస్తూ..ఇరగ దీసే స్టెప్పులతో సందడి చేశారు.
గొప్ప మనస్సున్న మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు అందించాలి. ఇవాళ భాయ్ బర్త్ డే. మా ప్రేమతో..అంటూ సల్మాన్‌ఖాన్ కు శుభాకాంక్షలు తెలియజేసింది.