Thug Life Movie | కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్’ (1987) క్లాసిక్‌గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాలో త్రిష కథానాయికగా కనిపించనుండగా.. దుల్కర్ సల్మాన్, జయం రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా మరో స్టార్ హీరో నటించనున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో తమిళ యువ హీరో గౌతమ్ కార్తీక్ నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కార్తీక్.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించనున్నారు. అనౌన్స్మెంట్ వీడియోలో శత్రువులతో పోరు చేస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించారు కమల్. వచ్చే ఏడాది ప్రధమార్థంలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది.