GoudSaab Movie | ‘గౌడ్ సాబ్’ ప్రేమకథ
GoudSaab Movie | అగ్ర హీరో ప్రభాస్ కజిన్ విరాట్‌రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్సాబ్'. ఈ చిత్రం ద్వారా డ్యాన్స్ మాస్టర్ గణేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీపాద ఫిల్మ్స్ పతాకంపై ఎస్ఆర్ కల్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్నారు. అగ్ర దర్శకుడు సుకుమార్ టైటిల్ లాంచ్ చేశారు.
GoudSaab Movie | అగ్ర హీరో ప్రభాస్ కజిన్ విరాట్‌రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్సాబ్’. ఈ చిత్రం ద్వారా డ్యాన్స్ మాస్టర్ గణేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీపాద ఫిల్మ్స్ పతాకంపై ఎస్ఆర్ కల్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్నారు. అగ్ర దర్శకుడు సుకుమార్ టైటిల్ లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. సుకుమార్ మాట్లాడుతూ ‘గణేష్ చక్కటి ప్రతిభావంతుడు.
‘జగడం’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. తను చేసే ప్రతి పాటలో ఓ కథ ఉంటుంది. ఇప్పుడు దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అంత బాగా నచ్చింది’ అన్నారు. ‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. డ్యాన్స్ మాస్టర్‌గా నన్ను ఎంతగానో ఆదరించారు. దర్శకుడిగా కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అని గణేష్ తెలిపారు. యాక్షన్ హంగులు కలబోసిన ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ఎమ్ స్వామి, సంగీతం: వెంగి, ఆర్ట్: బేబీ సురేష్ భీమగాని, రచన-దర్శకత్వం: గణేష్ మాస్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

