Game Changer Vs Devara | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలిసిందే. రాంచరణ్ (Game changer) నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. మరోవైపు ఎన్టీఆర్ నటిస్తోన్న ప్రాజెక్ట్ దేవర. ఈ సినిమాల థ్రియాట్రికల్ రైట్స్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 నార్తిండియన్ థ్రియాట్రికల్ రైట్స్ విషయంలో ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిందని తెలిసిందే. ఇక ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) హిందీ హక్కులు కూడా భారీ మొత్తంలో రూ.100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఇప్పుడు రాంచరణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న గేమ్ ఛేంజర్ వార్తల్లో నిలిచింది. హిందీ థ్రియాట్రికల్ రైట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దేవరను బీట్ చేసిందన్న వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం గేమ్‌ఛేంజర్ (Game changer) హిందీ థ్రియాట్రికల్ రైట్స్ ద్వారా రూ.75 కోట్లు రాబట్టడంతో.. ఈ ఫిగర్ దేవర రైట్స్‌ను (రూ.50 కోట్లు) ను దాటిపోయింది. కాగా RRR ద్వారా నార్త్ ఇండియన్ ప్రేక్షకులలో సూపర్ క్రేజ్ సంపాదించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. మరి హిందీ బెల్ట్‌లో గేమ్ ఛేంజర్, దేవర సినిమాల విషయంలో ఎలాంటి పోటీ చూపిస్తారో చూడాలంటున్నారు సినీ జనాలు. పై నాలుగు సినిమాల హక్కులను పాపులర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అనిల్ తడని సొంతం చేసుకోవడం విశేషం.
శంకర్ (Shankar) దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జాన్వీకపూర్‌కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం.