Game Changer | ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రామ్‌చరణ్ (Ram Charan). ఇక రామ్‌చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shanker) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Adwani) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి సాంగ్ లీక్ అయిందని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.
స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తున్న ‘గేమ్‌ఛేంజర్’ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురుచుస్తున్నారు. అయితే మ్యూజికల్ అప్డేట్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన రాకముందే ఒక సాంగ్ లీకైయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కోడుతున్నాయి. జాబిలమ్మ (Jabilamma) అంటూ ఈ పాట టైటిల్ ఉంది. కాగా దీనిపై ‘గేమ్‌ఛేంజర్’ మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
#GameChanger Part 2 pic.twitter.com/yrxXZzbRwL
— Anirudh (@Anniirruuddh) September 15, 2023
ఇదిలా ఉండగా.. ఈ సాంగ్ లీక్ కావడంపై మేకర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు రాంచరణ్ ఫ్యాన్స్ కూడా ఇలా సాంగ్ లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం సాంగ్ బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.