Game Changer | జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చింది
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ బుధవారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్' నుంచి ‘జరగండి..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Game Changer | అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ బుధవారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
‘జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి.. జరగండి జరగండి ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండి..’ అంటూ చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంతశ్రీరామ్ రచించగా, దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు రామ్‌చరణ్, కియారా అద్వాణీ జోడీ చక్కటి కెమిస్ట్రీతో మెప్పించారు. దర్శకుడు శంకర్ తనదైన శైలి భారీ హంగులతో కన్నులపండువగా ఈ గీతాన్ని తెరకెక్కించాడు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని 150 థియేటర్లలో ఈ పాటను ప్రదర్శించారు. ఈ చిత్రానికి కెమెరా: తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, ఆర్ట్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శంకర్.

అగ్ర హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రామ్‌చరణ్ దర్శనానికి వచ్చారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

