Game Changer Movie | మెగా అభిమానులకు ఇంకా ఎదురుచూపులు తప్పేలా లేవు. శంకర్‌తో సినిమా అనగానే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియెన్స్‌ను గేమ్ చేంజర్ మేకర్స్ నిరాశ పరుస్తూనే ఉన్నారు. అప్పుడొస్తుంది.. ఇప్పుడొస్తుంది అంటూ కబుర్లు వినడమే కానీ.. రిలీజ్ డేట్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పట్లో అది వచ్చేలా కూడా లేదు. ముందుగా రెండు సినిమాలను సమాంతరంగా షూట్ చేయాలని ప్లాన్ చేసినా.. అనుకోని పరిస్థితుల వల్ల శంకర్ ఇండియన్-2పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవలే గేమ్ చేంజర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసినా.. షూటింగ్ ఇంకా కొండంత బ్యాలెన్స్ ఉందని ఇన్సైడ్ టాక్.
ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ మెగా ఫ్యాన్స్‌ను కాస్త సంతోష పడేలా చేస్తుంది. అదేంటంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాబిలమ్మ అనే పాట ఒకటి లీకై సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది. రామ్‌చరణ్-శంకర్ కాంబోలో సినిమా వస్తుందంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజమే. అందులోనూ శంకర్ సినిమాలో పాటలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది గేమ్ చేంజర్ సినిమాలో ఇలాంటి పాటేంటని సోషల్ మీడియాలో థమన్పై ఓ రేంజ్లో ట్రోల్స్ చేశారు.
అయితే థమన్ పాటలు సహజంగా ఒక్క సారి వింటే పెద్దగా నచ్చదు. కానీ వినగా వినగా పాట తెగ నచ్చుతుంది. ఈ పాట కూడా అంతే అని పలువురు నెటీజన్లు కూడా కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఈ పాట మాత్రం లీకైప్పుడు జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు మెగా అభిమానుల టెన్షన్ ఏంటంటే.. ఇదే పాటను ఫస్ట్ సింగిల్ పేరుతో రిలీజ్ చేస్తారేమో అని భయం పుట్టుకుంది. లీకైన పాటకే ఆ రేంజ్లో ట్రోల్స్ వస్తే.. ఇక ఒరిజినల్ పాట రిలీజైతే ఇంకెంత ట్రోల్స్ చేస్తారో అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.