Game Changer First Day Collections | రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించి అలరించాడు. అయితే ఈ సినిమా తొలిరోజే రికార్డు కలెక్షన్లు అందుకుంది. మొదటిరోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఫీట్ సాధించిన టాప్ టెన్ ఇండియన్ సినిమాలలో గేమ్ ఛేంజర్ కూడా నిలిచింది.
ఇక మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూసుకుంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం ఫస్ట్ రోజు రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టింది. పుష్ప తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి 2(రూ.214 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.
BREAKING: Game Changer POSTER ₹186 cr pic.twitter.com/B9WlKnLo85
— Manobala Vijayabalan (@ManobalaV) January 11, 2025