Anand Devarakonda | యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన దొరసాని అంటూ తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఇక గత ఏడాది బేబి (Baby) సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు ఆనంద్. ఇందులో ఒకటి ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఓవైపు కామెడీతో పాటు మరోవైపు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
#GamGamGanesha – Trailer – 20th May pic.twitter.com/GWkGKeLEW1
— Aakashavaani (@TheAakashavaani) May 18, 2024